- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని మెరిట్ విద్యాసంస్థల నుండి జవహర్ నవోదయ కు బి. సహర్ష్ జిల్లా 43వ ర్యాంకు సాధించినట్లు సంస్థ కరస్పాండెంట్ పి కిరణ్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం కిరణ్ మీడియాతో మాట్లాడుతూ పాఠశాల నుండి 43వ ర్యాంకు సాధించి జవహర్ నవోదయకు ఎంపికైన సహర్ష ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ మేరకు విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ పి గౌతమి కిరణ్ లు కూడా అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని గొప్ప స్థానంలో నిలవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



