Tuesday, March 17, 2026
E-PAPER
Homeకరీంనగర్లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని  జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత అన్నారు.మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ జడ్జి  పుష్పలత మాట్లాడుతూ సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసుల పరిష్కారం చేయాలని సూచించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  సమావేశంలో  జిల్లా అదనపు ఎస్పీ డి.చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి  అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, మేజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి,  మేఘన, పోలీసు అధికారులు,కోర్టు మానిటరింగ్ పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -