నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. మంగళవారం ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలలో ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన మొత్తం 16 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఇందులో హెచ్ఎం గా చక్రధర్, మండల విద్యా శాఖ అధికారిగా రీతిక, జిల్లా విద్యా అధికారిగా రహమాన్ పాషా లు తమ పాత్రలను సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు.
కార్యక్రమం ముగింపులో ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వృత్తి గొప్పదని విద్యార్థులకు బోధన చేయడం ఎంతో కష్టమైన పని అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎంత శ్రమిస్తున్నారని విషయం ఈరోజు అర్థమైందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుకు కృషి చేయాలని కోరారు. గురులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణలొ పాఠశాల ఉపాధ్యాయ ఏ ఏ పి సి చైర్మన్ తాళ్ల సునీత హెచ్ఎం మామిడాల వెంకటేష్. బృందం శ్రీ సాయి ప్రసాద్, అశోక్, యాకుబ్ రెడ్డి, అనిల్, సంపత్ లు బాధ్యతలు నిర్వహించారు.



