టిఆర్టిఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-రాయికల్
ఉపాధ్యాయులకు కేటాయించే విద్యా, ఎన్నికల విధుల్లో సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని టిఆర్టిఎఫ్ (టిచర్స్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫోరం) డిమాండ్ చేసింది. గతంలో నిర్వహించిన ఎన్నికల విధుల్లో కొంతమంది ఉపాధ్యాయులకు మూడు దశల్లో డ్యూటీలు పడగా, మరికొంతమందికి అసలు విధులు కేటాయించలేదని సంఘ సభ్యులు పేర్కొన్నారు.
సీనియర్ ఉపాధ్యాయులకు విధులు లేకపోవడం, మరికొందరికి అధికంగా బాధ్యతలు పడడం వల్ల సమతుల్యత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన విధుల్లో ఇలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టిఆర్టిఎఫ్ సభ్యులు కోరారు. విధుల కేటాయింపులో సమానత్వం, సీనియారిటీ తప్పనిసరిగా పాటించాలని సూచించించారు.
ఈ సందర్భంగా మంగళవారం మండల విద్యాధికారికి, తహసీల్దార్ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ ముక్కెర శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎలిగేటి రాజా కిషోర్, జిల్లా కార్యదర్శి పుర్రె శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొల్లె గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజు, కార్యవర్గ సభ్యులు మాలోతు రాజు, రాజకిరణ్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.



