- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులు ఏకారుప దుస్తులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్ వాడిల్లోని చిన్నారులకు సైతం అందిస్తున్నారు. మండల పరిధిలో 15 గ్రామాల్లోని 38 అంగన్ వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు మొత్తం 1356 మంది చిన్నారులున్నారు. ఇందులో బాలికలు 662,బాలురు 684 ఉన్నారు. వీరికి 1356 దుస్తులు వచ్చాయి. ఇందులో మంగళవారం వరకు 650 దుస్తులు పంపిణీ చేయగా, ఇంకా 706 పంపిణీ చేయాల్సి ఉంది.ప్రతి చిన్నారికి రెండు జతల చొప్పున ఇస్తారు. ప్రస్తుతం ఒక్కో జతను అందించి, జూన్ మాసంలో మరో జత దుస్తులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -



