- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం విడుదలైన నవోదయ పరీక్షల ఫలితాలలో చైతన్య విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థి అక్షర ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.నవోదయలో ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.
- Advertisement -



