సంగీత ఆధారిత వినోద రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన విభాగం యూని వర్సల్ మ్యూజిక్ ఇండియా, గాయకుడు-సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్ లేబుల్ అల్బుకర్క్యూ రికార్డ్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, అల్బుకర్కీ రికార్డ్స్, అనిరుధ్ రవిచందర్ రూపొందించిన పాప్, హిప్-హాప్ సంగీతాన్ని శ్రోతలకు మరింత చేరువయ్యేలా చేయబోతున్నారు. ఈ లేబుల్ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్‌లో అనిరుధ్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్రణాళిక చేశారు. ఈ భాగస్వామ్యంపై దేవరాజ్ సన్యాల్, చైర్మన్చ సీఈఓ, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా, ఎస్వీపీ స్ట్రాటజీ, ఎ.ఎం.ఇ.ఎ.మాట్లాడుతూ, ‘అనిరుధ్ రవిచందర్ భారతీయ సంగీత భవిష్యత్తును ప్రతిబింబించే కళాకారుడు. ధైర్యవంతమైన శైలి, సొంత ప్రత్యేకత, అపారమైన సామర్థ్యంతో కూడిన ప్రతిభ ఆయన సొంతం. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాలో మార్పు తీసుకువచ్చే ప్రతిభను గుర్తించడం మా ప్రధాన బలం. ఈ భాగస్వామ్యం ఆ నమ్మకాన్ని నిలబెడుతుంది. అనిరుధ్ తన సంగీత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంలో ఆయనకు మద్దతుగా నిలవడం మాకు గర్వకారణం. అలాగే భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపై మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.
‘అల్బుకర్క్యూ రికార్డ్స్‌ను కళాకారుల ఆధ్వర్యంలో నడిచే స్వదేశీ రికార్డ్ లేబుల్గా, స్వతంత్ర ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించాం. పాప్, హిప్-హాప్ సంగీత రంగాల్లో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చూపిస్తున్న నాయకత్వమే నన్ను భాగస్వామిగా మార్చింది. భారతదేశంలోని స్వతంత్ర కళాకారుల కొత్త తరాన్ని ముందుకు తీసుకువచ్చి, వారి స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు పరిచయం చేయడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని అనిరుధ్ రవిచందర్ చెప్పారు.
మేనేజింగ్ డైరెక్టర్, యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా సనుజీత్ భుజబల్ మాట్లాడుతూ,’అనిరుధ్ రవిచందర్ చాలా కాలంగా సంగీతానికి అతీతంగా సజనాత్మక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ వచ్చిన ప్రముఖ శక్తి. సినిమాల కోసం ఆయన అందించిన అనేక హిట్ పాటలతో పాటు, ఆయన సజనాత్మక కషిని ఎంతో ఆసక్తిగా అనుసరించే విస్తారమైన అభిమాన వర్గాన్ని కూడా సంపాదించారు’ అని తెలిపారు.
సంగీత ప్రపంచంలో సరికొత్త ప్రయాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



