వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. దీనికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.
ఈ వేడుకకు ‘దేవి’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్ పూజా గాంధీ, కన్నడ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఆర్.కె. విశ్వనాధ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎన్.ఆర్.కె. విశ్వనాధ్, దర్శకుడు సంజీవ్ మేగోటి పదేళ్ల తర్వాత మళ్లీ ఒక మంచి కథతో కన్నడ ఇండిస్టీలోకి రావడం అభినందనీయమన్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నటి ప్రేమ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరో నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ, ‘ఈ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది’ అని తెలిపారు. ‘కేవలం 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాను తెరకెక్కించడం ఒక ప్రత్యేక అనుభవం. ఇది పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు.
నయా సస్పెన్స్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -



