Wednesday, March 18, 2026
E-PAPER
Homeసోపతిఅంచనాలు మరింత పెంచేలా..

అంచనాలు మరింత పెంచేలా..

- Advertisement -

ఏప్రిల్‌ 3న రిలీజ్‌ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్‌, ప్రమోషనల్‌ ప్లానింగ్‌తో ఈ సినిమా అందరి దష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జరిగిన థియేట్రికల్‌ బిజినెస్‌ డీల్‌ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్‌ రైట్స్‌ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్‌ సర్కిల్స్‌ భావిస్తున్నాయి అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్‌ విడుదల చేస్తుండగా, ఓవర్‌సీస్‌లో మేకర్స్‌ భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. అథర్వణ భద్రకాళి పిక్చర్స్‌ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలను నిర్వహిస్తోంది.
ఈ సంస్థ అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, యూరప్‌, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేసింది.
ముఖ్యంగా నార్త్‌ అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్‌ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్‌ షోలు ఏప్రిల్‌ 2న ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
థియేట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ విషయాలతోనే కాకుండా ఈ సినిమాకు నాన్‌ థియేట్రికల్‌ రంగంలో కూడా మంచి డీలింగ్స్‌ కుదిరాయి. మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా..ఆడియో హక్కులను సారెగమ దక్కించుకుంది.
మొత్తానికి విడుదలకు ముందే ఈ సినిమా అందరిని మరింత ఎగ్జైట్‌ చేస్తుండటంతో అదే స్థాయిలో అంచనాలు పెరిగాయని మేకర్స్‌ తెలిపారు.
సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా ప్రేమ, హాస్యం, ఫాంటసీ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు మానస శర్మ కథను అందించటంతో పాటు దర్శకత్వం వహించారు. నటి నిర్మాత నిహారిక జీ స్టూడియోస్‌ సమర్పణలో తన పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి ఈ మూవీని నిర్మించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -