Wednesday, March 18, 2026
E-PAPER
Homeఆటలురెండో టీ20లో న్యూజిలాండ్‌ గెలుపు

రెండో టీ20లో న్యూజిలాండ్‌ గెలుపు

- Advertisement -

దక్షిణాఫ్రికాతో సిరీస్‌
హామిల్టన్‌:
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్నీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 175పరుగులు చేయగా.. అనంతరం దక్షిణాఫ్రికాను 15.3ఓవర్లలో 107పరుగులకే ఆలౌట్‌ చేసింది. తొలుత న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే(60) అర్ధసెంచరీకి తోడు కెల్లీ(21), కెప్టెన్‌ సాంట్నర్‌(20)కి తోడు చివర్లో జోష్‌ క్లార్క్‌సన్‌(26; 9బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసారు. దక్షిణాఫ్రికా బౌలర్లు ముల్డర్‌కు రెండు, లిండే, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, బార్ట్‌మన్‌, కోర్ట్జేలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం కివీస్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. ఫెర్గుసన్‌, సీర్స్‌కు మూడేసి, సాంట్నర్‌కు రెండు దక్కాయి. దక్షిణాఫ్రికా జట్టులో లిండే(33) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్‌ ముల్డర్‌(16)కి తోడు హార్మన్‌(19), స్మిత్‌(12), ఫోరెస్టర్‌(12) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డెవాన్‌ కాన్వేకు దక్కింది. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -