– దత్తత తీసుకునే బిడ్డ వయసు ప్రామాణికం కాదు!
– సుప్రీంకోర్టు స్పష్టీకరణ
– సామాజిక భద్రత కోడ్‌లోని సెక్షన్ 60 (4) కొట్టివేత
న్యూఢిల్లీ : మూడు మాసాల్లోపు వయస్సు కలిగిన శిశువును చట్టపరంగా దత్తత తీసుకుంటే ఆ మహిళ ప్రసూతి శలవుకు అర్హురాలని పేర్కొంటున్న చట్ట నిబంధనను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. పునరుత్పత్తి స్వయం ప్రతిపత్తిలో భాగమే దత్తత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దత్తత తీసుకునే బిడ్డ వయసుతో నిమిత్తం లేకుండా ఆ దత్తత తల్లి 12 వారాల పాటు ప్రసూతి శలవుకు అర్హురాలు అని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2020 నాటి సామాజిక భద్రతా కోడ్‌లో సెక్షన్ 60(4) ఇప్పటివరకు ప్రసూతి శలవు తీసుకోవడానికి బిడ్డకు మూడు మాసాలు అనే వయో పరిమితిని విధించిందని, కానీ ఇది రాజ్యాంగంలోని 14, 21 అధికరణలను ఉల్లంఘిస్తోందని బెంచ్ పేర్కొంది. అలాగే పితృత్వ శలవును సామాజిక భద్రతా ప్రయోజనంగా గుర్తించే నిబంధనను తీసుకురావాలని కూడా కేంద్రాన్ని సుప్రీం కోరింది. సామాజిక భద్రతా కోడ్‌లోని సెక్షన్ 60 (4)ను సవాలు చేస్తూ న్యాయవాది హంసానందిని నండూరి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.
ప్రసూతి సెలవు ఎప్పుడైనా తీసుకోవచ్చు
- Advertisement -
- Advertisement -



