నవతెలంగాణ – స్టేషన్ఘనపూర్
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామపరిధి దోనెబండలో మంగళవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలబోయిన మల్లేష్(42) సమీప దూపకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్లలోకి దూకేసరికి బురదలో ఇరుక్కుపోయాడు. గమనించిన తోటి మత్స్యకారులు బయటికి తీసే సమయంలోపే మల్లేష్ మృతిచెందినట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య సంధ్య, కుమారుడు సతీష్, కూతురు సౌజన్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్చాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దూదిమెట్ల నరేష్ తెలిపారు.
చేపలవేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



