- Advertisement -
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని పిఆర్ఎస్ ఈ వెంకటేశ్వర్లు కాంట్రాక్టర్ కు సూచించారు. బుధవారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులను, బ్యూటిఫికేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఆయనతోపాటు ఈ ఈ తిరుపతి, డిఈ మహేష్, ఏఈ పృధ్వి రాజ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



