హాస్య మూవీస్ బ్యానర్ పై ‘సామజ వరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్స్ అందించారు నిర్మాత రాజేష్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధానపాత్రలో ‘బ్లాక్ గోల్డ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నేడు (గురు వారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి మీడియాతో ముచ్చటించారు. ఉగాది పండగ, నా బర్త్‌డే ఒకే రోజు రావడం చాలా సర్ ప్రైజ్‌గా ఉంది. కొత్త సంవత్సరంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇలా జరిగింది. గత ఏడాది దీపావళికి ‘కె రాంప్’ సినిమా రిలీజై, సూపర్ హిట్ అయ్యింది.
అదే ఊపులో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. మా బ్యానర్ నుంచి సరికొత్త సినిమాలను చూడబోతున్నారు. నేను చేసే సినిమా కథల్లో ఒక కొత్త పాయింట్ ఉండేలా చూసుకుంటాను. విన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అలాగే స్క్రీన్ మీద అది ఎలా కనిపిస్తుంది అన్నదీ ముందే చూసుకుంటాను. ‘సామజవరగమన, కేరాంప్, భైరవకొన..’ఇలా అన్ని సినిమాల్లో డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాలు చూసిన అనుభవం ఉంది. ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు అనే ఐడియా ఉంటుంది. అది స్క్రిప్ట్ సెలెక్షన్‌లో నాకు చాలా హెల్ప్ అయింది. గన్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్, గన్ మాత్రమే వాడే విలన్ మధ్య జరిగే కథ ‘బ్లాక్ గోల్డ్’. చాలా కొత్త పాయింట్. భారీ స్కేల్‌లో తీస్తున్నాం.
సంయుక్తకి ఇది చాలా కొత్త పాత్ర అవుతుంది. జూన్ లేదా జూలైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. హీరో నరేష్ సినిమాని సమ్మర్‌లో విడుదల చేస్తాం. నరేష్ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఆది సాయి కుమార్ చేయబోయే సినిమా ఈ నెల 27న స్టార్ట్ అవుతుంది. అల్లు శిరీష్, ‘సోలో లైఫ్’ ఫేం సుబ్బు డైరెక్షన్‌లో ఒక సినిమా, అడివి శేష్‌తో కూడా మరొక సినిమా చర్చల్లో ఉంది. ఈటీవీ విన్‌తో చేయబోయే సినిమా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సాగే కోర్ట్ రూమ్ డ్రామా. నెక్స్ట్ ఇయర్‌లో ఒక పెద్ద సినిమా ఖచ్చితంగా ఉంటుంది.
ఆ.. అనుభవం ఉపయోగపడింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



