కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్’. ఈ సినిమాని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్‌ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ఈ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ‘కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ – నో ఏజ్ లిమిట్’ అనే స్లోగన్‌తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. తాజాగా బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
కాలేజ్ డేస్‌లోని కలర్‌ఫుల్ లైఫ్ అంతా ఈ ట్రైలర్‌లో కనిపించింది. జూనియర్ ఇంటర్‌లో చేరిన ప్రవీణ్ అండ్ గ్యాంగ్ చేసే హంగామా ప్రతి ఆడియెన్‌ను తమ లైఫ్ మెమొరీస్ గుర్తుచేస్తుంది. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్‌లో డ్యాన్సులు, కాలేజ్‌లో చేరాక ప్రేమలు, సీనియర్స్‌తో ఫైట్స్…ఇవన్నీ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. మదర్ మేరీ జూనియర్ కాలేజ్‌లో చదివే స్టూడెంట్ ప్రవీణ్. అతనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ప్రవీణ్ కలెక్టర్ అవుతాడని అతని తల్లి నమ్మకం పెట్టుకుంటుంది. ఆ నమ్మకాన్ని ప్రవీణ్ నిలబెట్టుకున్నాడా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోందని ట్రైలర్‌లో చెప్పారు.
‘యూత్’ఫుల్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



