పేదల స్థితిగతుల్లో మార్పు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మూసీ ప్రక్షాళన మహాయజ్ఞం వంటిదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దీని ఫలితంగా పేదల స్థితిగతుల్లో మార్పు వస్తోందని చెప్పారు. మూసీ పక్కన ఈగలు, దోమల మధ్యే పేదలు బతకాలా? అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. ఇది నగరాభివృద్ధికి నాంది అన్నారు. పేద ప్రజలకు అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. వాళ్లు కొత్త ఇండ్లలో ఉండటం బీఆర్ఎస్కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు నాణ్యమైన విద్య అందిస్తామనీ, మురికి దూరంగా ఉంచుతామని తెలిపారు. మురికిని శుద్ది చేసిన తర్వాతనే ఆ నీటిని నదిలోకి పంపిస్తామని వివరించారు. గాంధీసరోవర్ నిర్మించి తీరుతామని తెలిపారు.
మూసీ ప్రక్షాళన మహాయజ్ఞం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



