– ఫలించిన టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కృషి
– మంత్రి పొంగులేటి, సీసీఎల్‌ఏకు ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎస్‌ఏ) కృషి ఫలించింది. దీంతో 70 నయాబ్ తహశీల్దార్ల (డీటీ)కు తహశీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డిఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. మల్టీ జోన్-1లో 43 మంది, మల్టీజోన్-2లో 27 మంది కలిపి మొత్తం 70 మండి డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించామని వివరించారు. టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేష్ పాక, బాణాల రాంరెడ్డి, వి భిక్షం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారితోపాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్ వి లచ్చిరెడ్డి కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. డీటీల నుంచి తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని పలు మార్లు మంత్రి పొంగులేటి, సీసీఎల్‌ఏ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఎట్టకేలకు వారి సహకారంతోనే టీజీటీఏ, టీజీఆర్‌ఎస్‌ఏ కృషి ఫలించిందనీ, దీంతో ఈ పదోన్నతులు లభించాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే కాకుండా అన్ని స్థాయిలలో పదోన్నతులను కూడా ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారని వివరించారు.
70 మంది డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



