హైదరాబాద్ : ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ ఎపిస్ ఇండియా తన మిస్క్ బ్రాండ్ ద్వారా వినూత్నమైన మసాలా ఖర్జూరాలను విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో వీటిని ఎపిస్ ఇండియా ఎండీ అమిత్ ఆనంద్ ఆవిష్కరించారు. సంప్రదాయ ఖర్జూరాలకు భారతీయ రుచులను అద్దుతూ.. అచారీ, చింతపండు, చిల్లీ లైమ్ అనే మూడు విభిన్న రుచుల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. గింజలు తీసేసి, ముక్కలుగా కట్ చేసిన ఈ ఖర్జూరాలు అప్పటికప్పుడు తినడానికి వీలుగా ఉంటాయన్నారు. నూనె పదార్థా లకు, చక్కెర స్నాక్స్‌కు ఉత్తమ ప్రత్యామ్నా యంగా నిలుస్తా యన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ ఎపిస్ తేనేకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ విభాగంలో ఆంధ్రలో తమకు 26 శాతం, తెలంగాణలో 16 శాతం చొప్పున వాటా ఉందన్నారు. దీన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.



