9 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ఆర్మూర్/మెండోరా/బోధన్
ఒకవైపు పరీక్ష జరుగుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో పదవ తరగతి ప్రశ్నా పత్రాలు వైరల్ గా మారిన ఘటనపై డీఈఓ సీరియస్ అయ్యారు. అందుకు గల బాధ్యులను గుర్తించి తొమ్మిది మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకెళ్తే.. పదోతరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా బుధవారం హిందీ తెలుగు పరీక్షలు జరిగాయి. అయితే వీటికి సంబంధించిన ప్రశ్నా పత్రాలు నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు, మెండోరా జెడ్పీహెచ్ఎస్, బోధన్ జూనియర్ కాలేజ్ నుంచి లీకై సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు అధికారులు గుర్తించారు. పరీక్షలు ప్రారంభం అయిన తరువాత పరీక్ష కేంద్రం నుంచి ఉపాధ్యాయులు సెల్ ఫోన్ లో తీసిన ఫోటోలు బయటకు వచ్చాయి. అవే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన అనంతరం అందుకు కారణమైన తొమ్మిది మంది ఉపాధ్యాయులను గుర్తించి కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు డీఈఓ అశోక్ బుధవారం ఒక ప్రకటనలు తెలిపారు.
సస్పెండ్ అయిన వారిలో బి. రాజేందర్ (ప్రధానోపాధ్యాయుడు, జెడ్పీహెచ్ఎస్ డేగావ్, ఆలూరు మండలం), టి. విజరు కుమార్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ మాచర్ల, ఆలూరు మండలం), పి. ఉమెందర్ (సెకండరీ గ్రేడ్ టీచర్, జెడ్పీహెచ్ఎస్ మెర్ధపల్లి, ఆలూరు మండలం), ఎన్. సాగర్ (సెకండరీ గ్రేడ్ టీచర్, ఎంపీయూపీఎస్ డీకంపల్లి, ఆలూరు మండలం), పి.మమత (ప్రధానోపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ ఎస్ఆర్ఎస్పీ, మేండోర మండలం), జి. రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ వెల్గటూర్, మేండోర మండలం), చి. బుపతి (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ ఎస్ఆర్ఎస్పీ, మేండోర మండలం), కె. వేణు (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ పెంటకలాన్, బోధన్ మండలం), ఎ. శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ కల్దుర్కి, బోధన్ మండలం) ఉన్నారు.
సోషల్ మీడియాలో టెన్త్ ప్రశ్నాపత్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



