– ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజ్ఞప్తి
– మండలి స్పెషల్ మెన్షల్లో పలు సమస్యలను ప్రస్తావించిన సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్న వారికి పట్టాలందించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసన మండలి స్పెషల్ మెన్షన్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేదలేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్ అధికారులు బలవంతంగా తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో ఎండాకాలం దుమ్ము లేవకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించాలని సభ్యులు మదుసూధనాచారి ప్రభుత్వానికి విన్నవించారు. పేదల విషయంలో ఒకలా, పెద్దల విషయంలో ఒకలా హైడ్రా ప్రవర్తిస్తోందని సభ్యులు శంభీపూర్ రాజు, జౌట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీన్మార్ మల్లన్న, అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రూ.10 లక్షల లోపు కాంట్రాక్ట్ బిల్లులను వెంటనే చెల్లించాలని భాను ప్రసాద్‌రావు, ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని అద్దంకి దయాకర్, వెలుగు మట్ల బాధితులందరికి ఇండ్లు మంజూరు చేయడంతో పాటు పరిహారం అందించాలని తాత మధు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని నవీన్ కుమార్ కోరారు. ఆర్టీఏ సమాచారం సకాలంలో అందించాలని దాసోజు శ్రవణ్, బ్రహ్మణ పరిషత్ నిధులు కేటాయించాలని వాణీదేవి, లొంగిపోయిన మావోయిస్టులకు వెంటనే పునరావాసం అందించాలని తక్కళ్లపల్లి రవీందర్రావు, రంజాన్ పండుగ నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లోని ఈద్గాలు, మజీదుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని రహ్మత్‌బేగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయితీలకు రూ.10 లక్షలు వెంటనే విడుదల చేయాలని పోచంపల్లి శ్రీనివాసరావు, ప్రయివేట్ టీచర్ల నుంచి ప్రొఫెషన్ టాక్స్ వసూలు ఆలోచనను విరమించుకోవాలని దేశపతి శ్రీనివాస్ కోరారు. సభ్యులు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్ సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్న పేదలకు పట్టాలివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



