మంత్రి పొంగులేటికి మండలి చైర్మెన్ సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫోర్ వీలర్ వాహనాలున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వెసులుబాటు కల్పించాలని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇందిరమ్మ ఇండ్లపై మండలిలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా సమస్యను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకొచ్చారు. ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఫోర్ వీలర్ ఉన్నవారు అర్హులు కాదని చెప్పారు. కానీ టాటా ఏస్ లాంటి వాహనాలను అద్దెకు, లోన్లపై తెచ్చుకుని కొంతమంది జీవనం సాగిస్తున్నారు. అలాంటి వాహనాలు కల్గిన వారు ఇప్పటికే బేస్మెంట్ల వరకు నిర్మాణాలు చేసుకున్నారు.
మీరు వారికి అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫోర్ వీలర్ ఉన్నవారు అనర్హులు అనే గైడ్ లైన్స్‌లో మార్పులు చేయండి” అని గుత్తా సూచించారు. ఈ విషయంపై తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల రూల్స్ మార్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



