రాష్ట్ర బీసీ కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ కార్యాలయాల్లో బీసీ ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న బీసీ కమిషన్ ఆ కార్యాలయాలను సందర్శించాలని నిర్ణయించింది. ఈ నెల 23న ఎస్పీడీసీఎల్, 24న జెన్కో, ట్రాన్స్‌కో, 26న ఎన్పీడీసీఎల్ కార్యాలయాలను సందర్శించి రిజర్వేషన్ల అమలు తీరుపై సమీక్షించనున్నది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో చైర్మెన్ జి.నిరంజన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బి.బాలమాయదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పెండింగ్ దస్త్రాలను సమీక్షించి పరిష్కరించే విషయంపై చర్చించారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వంలోని కొన్ని విభాగాల నుంచి అవసరమైన సమాచారం త్వరితగతిన రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
23న ఎస్పీడీసీఎల్ కార్యాలయ సందర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



