- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక మిగిలిన జిల్లాల్లో నేడు సాధారణ వాతావరణం ఉంటుందని చెప్పారు.
- Advertisement -



