- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లో నేడు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (TGFA) ప్రదానోత్సవం జరగనుంది. HITEX కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ వేడుకలో సీఎం రేవంత్, భారతీయ సినీ రంగ దిగ్గజాలు, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రష్మిక మందన్న, మాధురి దీక్షిత్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. నిధి అగర్వాల్, శ్రేయా ఘోషల్, దేవి శ్రీ ప్రసాద్, మంగ్లీ వంటి కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
- Advertisement -



