Thursday, March 19, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎల్లమ్మ చెరువు పనుల్లో వేగం పెంచాలి

ఎల్లమ్మ చెరువు పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -

– ఆలయాల్లో పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు , స్థానిక నేతలకు సూచించారు. ఆయన తో పాటు మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, హుస్నాబాద్ కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు హక్కు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ ఉన్నారు.

పొట్లపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పొట్లపల్లి గ్రామ సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్  ,మాడిశెట్టి శ్రీధర్, మార్క అనిల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -