Thursday, March 19, 2026
E-PAPER
Homeనిజామాబాద్నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

- Advertisement -

నవతెలంగాణ జుక్కల్

ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం నాడు దోస్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నరేంద్ర ఆచార్య మహారాజు గారి ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థానంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం జుక్కల్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోపాల్ మహారాజ్ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.

ఈ కార్యక్రమాలలో గ్రామ సర్పంచ్ సావిత్ర గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, స్థానిక మండల నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, పెద్దగుల్లా సర్పంచ్ మాధవరావు దేశాయ్, మద్నూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెవుల వార్ హనుమాన్లు, జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -