నవతెలంగాణ-కమ్మర్ పల్లి
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ఉప్లూర్ లో ఓం శ్రీ మొదటి పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం చిట్టి పద్ధతిలో ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షులుగా జిందం మహేష్, ఉపాధ్యక్షులుగా పెంబర్తి నరేష్ కుమార్, కార్యదర్శిగా అంగరి రమేష్, కార్యవర్గ సభ్యులుగా జిందం శ్రీనివాస్, నాగుల ప్రసాద్, దైవశెట్టిగా ద్యావరశెట్టి తిరుపతి లను చిట్టి పద్ధతిలో ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సంఘ సభ్యులు అభినందించారు. అంతకుముందు సంఘ భవనంలో పద్మశాలీల కులదైవమైన మార్కండేయ పూజను ఘనంగా నిర్వహించి, సభ్యులు ఉగాది పచ్చడిని స్వీకరించారు.2025-26 సంవత్సరానికి గాను సంఘ జమ, ఖర్చులను పరిశీలించారు. కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యెనుగందుల శశిధర్, సంఘం సీనియర్ సభ్యులు జిందం మల్లేష్, ఎనుగందుల జనార్ధన్, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



