- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకానికి సంబంధించిన కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నియామకాలు మార్చి 18 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. అదేవిధంగా శాసన మండలిలో అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ లను ప్రభుత్వ విప్‌లుగా నియమించారు.
- Advertisement -



