Friday, March 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువడగండ్ల వాన

వడగండ్ల వాన

- Advertisement -

నేల రాలిన మామిడి
వంగిపోయిన మొక్కజొన్న పైరు
మేడారంలో కూలిపోయిన వ్యాపారుల గుడారాలు

నవతెలంగాణ-బొంరాస్‌పేట్‌/ ములుగు/మహదేవపూర్‌
రెండు మూడ్రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం పలు జిల్లాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పైరు ఒరిగిపోయింది. వికారాబాద్‌, ములుగు, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో వర్షం, వడగండ్లు పడ్డాయి. వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండల
పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో వడగండ్ల వాన కురిసింది. గురువారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని బలమైన గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. దీంతో మామిడి కాయలు రాలిపోయాయి. గాలి బలంగా వీచడంతో ఇండ్లపై రేకులు, ప్లాస్టిక్‌ కవర్లు కొట్టుకుపోయాయి.

మేడారంలో వడగండ్లు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. చిరు వ్యాపారులు తాత్కాలికంగా చేసుకున్న గుడారాలు కూలిపోయాయి. ట్రాఫిక్‌ బూత్‌లు, భారీ గేట్లు రోడ్లపై కిందపడిపోయాయి. ఇండ్లపైకప్పు రేకులు పగిలిపోయాయి. మేడారం పరిసరాలన్నీ జలమయమయ్యాయి. ఉగాది పర్వదినాన మండలంలో నర్సింహాసాగర్‌, గాంధీనగర్‌ తదితర గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. ఇప్పటికే కోసిన మిర్చీ కల్లాల్లో ఆరబెట్టి ఉండగా వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాగే, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలో వడగళ్ల వాన పడింది. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్నతో పాటు మిర్చి పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -