వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరిస్తున్న అగ్రకథానాయకుడు చిరంజీవి సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ఆయన రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. ‘రక్తం యొక్క ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నేను అర్థం చేసుకున్నప్పుడు నా అభిమానులందరినీ రక్తదానంలో పాల్గొనేలా స్ఫూర్తిని ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది.
ఆ ఆలోచన నాకు 25 ఏళ్ల క్రితమే కలిగింది. అయితే నేను కేవలం అక్కడితోనే ఆగిపోదలచుకోలేదు. భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యను ఎలా అందించాలనే దానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నన్ను స్ఫూర్తిగా తీసుకుని నటుడు సూర్య ‘అగరం ఫౌండేషన్’ను ప్రారంభించారు. ఇప్పుడు, నేను ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఉచిత విద్యా బోధనను ప్రారంభించాలనుకుంటున్నాను. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడైతే అవసరం ఉంటుందో, అక్కడ ఉచిత విద్యను అందించే దిశగా కృషి చేస్తాను’ అని తెలిపారు. ఈ కొత్త విద్యా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తానని చిరంజీవి చెప్పారు.
త్వరలో ఉచిత విద్య ప్రాజెక్ట్‌కి శ్రీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



