ముంబయి : ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టి20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. 3 మ్యాచ్‌ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపిఎల్‌లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. గత సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లి కీలకపాత్ర పోషించాడు. ఆర్సీబి తమ తొలి మ్యాచ్‌లో 28న చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
విరాట్ కోహ్లి ప్రాక్టీస్ షురూ
- Advertisement -
- Advertisement -



