- Advertisement -
నవతెలంగాణ-రెంజల్ : రెంజల్ మండలం దుపల్లి గ్రామంలో నిర్వహించిన జడ కొప్పు ను సి ప సాయి చైతన్య గురువారం సాయంత్రం వీక్షించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సాంప్రదాయ పద్ధతిలో ప్రతి ఏడాది కోలాటం నిర్వహించడం ఆనవాయితీగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధనుర్ నరసవ్వ, మాజీ సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిహెచ్ బాబన్న, సింగిల్ విండో మాజీ చైర్మన్ శేషు గారి భూమారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు లింగన్న యాదవ్, కోలాట నిర్వాహకులు లచ్చిమి గారి సాయిలు, లక్ష్యం గారి నరసయ్య, మారపోతున్న, సాకలి శంకర్, గ్రామ రైతులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



