నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అనువుగా స్థానిక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద శుక్రవారం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. ఇదిగా పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని ఉడ్చి, పిచ్చి మొక్కలను తొలగించారు.
ఈద్గా వద్ద గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బంది నిర్వహించిన శ్రమదానం కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి గంగాజమున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రశాంతంగా ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అణువుగా ఈద్గా ప్రాంతాన్ని గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.



