Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేవరాంపల్లి స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలి

దేవరాంపల్లి స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలి

- Advertisement -

ప్రజల డిమాండ్ – విద్యార్థుల కోసం మంత్రి చొరవ అవసరం
నవతెలంగాణ – కాటారం 

కాటారం మండలంలోని దేవరాంపల్లి  స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆపాలని స్థానిక ప్రజలు, విద్యార్థులు  కోరుతున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సులు అక్కడ ఆగకపోవడంతో గ్రామ ప్రజలు, ముఖ్యంగా స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవరాంపల్లి, పరిసర గ్రామాలకు చెందిన వారు రవాణా కోసం కాటారం లేదా ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయని ప్రజలు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు ఆగకపోవడం వల్ల విద్యార్థులు ఆలస్యంగా స్కూల్‌కి చేరుకోవడం, క్లాసులు మిస్ అవుతున్న పరిస్థితి నెలకొంది.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దేవరాంపల్లి  స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులకు స్టాప్ కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్కడ చెప్పినా అక్కడే బస్సు ఆపిన రోజులు గుర్తు చేసుకుంటున్న ప్రజలు చర్యలు తీసుకోవాలని తుటి మనోహర్ డిమాండ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కోరినా అక్కడ బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుటి మనోహర్ అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులు రవాణా సమస్యల వల్ల సమయానికి చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో ప్రజల సౌకర్యం కోసం వెంటనే స్పందించి బస్సులు ఆపేలా అధికారులు చర్యలు తీసుకునేవారని, ఇప్పుడు మాత్రం ఆ స్పందన లోపించిందని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చోట్ల బస్సు ఆపేలా చర్యలు తీసుకోవాలని తుటి మనోహర్ డిమాండ్ చేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడితే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -