నవతెలంగాణ – పెద్దవూర
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలంలో గురువారం రాత్రి ఉగాది పండుగ రోజు జరిగింది. పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన నడ్డి శివ (19) స్టూడెంట్ అను అతను రాత్రి దాదాపు 08.40 సమయంలో తన యొక్క మోటార్ సైకిల్ పై లింగంపల్లి నుంచి బయలుదేరి పెద్దగూడెం స్టేజి వద్దకు వెళుతుండగా పెద్దగూడెం స్టేజి సమీపంలోకి వెళ్ళగానే అదే సమయంలో హాలియా వైపు నుండి పెద్దవూర కు వెళ్తున్న ఒక లారీ నెంబర్ టీ ఎస్ -05-యూఈ -9747 నంబర్ గల లారీ అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న నడ్డిశివ బైక్ ను ఢీ కొట్టింది.
దాంతో నడ్డి శివ తలకు,ఇంకా చాలా చోట్ల తీవ్రగాయాలై అక్కడి కక్కడే మృతి చెందారు. వనపర్తి జిల్లా కు చెందిన లారీ డ్రైవర్ తడకల రాముడు లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తుండడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. నడ్డి శివమృత దేహాన్ని నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు. శుక్రవారం మృతుడి తండ్రి నడ్డి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.



