- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
హన్మకొండ పట్టణానికి చెందిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10వరకు చదివే బాలికలకు ఉచితంగా మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు, క్లబ్ సభ్యులు మిరియాల రాజ్ కుమార్ ల చేతులమీదుగా శుక్రవారం పునర్వినియోగ శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వల్లెంకుంట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుదర్శనం, తాడిచర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, వివిధ పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
- Advertisement -



