Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీతాలు పెంచకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం

జీతాలు పెంచకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం

- Advertisement -

– మంత్రి కార్యాలయం ముట్టడికి యత్నం… అడ్డుకున్న పోలీసులు 
– రోడ్డుపై ధర్నా చేసిన సిఐటియు, ఆశ కార్యకర్తలు 
– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

ఈ బడ్జెట్ సమావేశంలోనే ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేల రూపాయలు నిర్ణయం చేయాలని లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల్ స్వామి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి  చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు.  ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 వేలు నిర్ణయించాలని కోరుతూ శుక్రవారం హుస్నాబాద్ లో  మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి వెళ్లిన సిఐటియు, ఆశ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పోలీసుల కంట పడకుండా సిఐటియు ఆశ కార్యకర్తలు మంత్రి కార్యాలయం ముట్టడి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు సిఐటియు నాయకులు ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి హుస్నాబాద్ ,అక్కన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ బడ్జెట్ సమావేశంలోనే 18 వేలు, పి. ఎఫ్, ఈ. ఎస్. ఐ సౌకర్యాలతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే జనాభా ప్రాతిపాదికన మండల, పట్టణ కేంద్రాలలో ఉంటున్నటువంటి ఆశ వర్కర్లకు ఎక్కువ పని భారం పడుతుందన్నారు. 

ఇప్పటికే ఆశ వర్కర్లపై అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు వేధింపులకు గురి చేస్తున్నారని వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతనాలు పెంచకపోతే సమస్యలు పరిష్కారం చేయకపోతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూలక్ష్మి, ప్రవీణ, కోశాధికారి భాగ్యలక్ష్మి ,ఆశా వర్కర్లు  బాలమణి, భాగ్య, శ్రీలత, అంజలి ,రమ, కమల ,లక్ష్మి, వాణి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -