Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక పాఠశాలకు “మేము సైతం” సేవా సంస్థ టీవీ బహుకరణ

ప్రాథమిక పాఠశాలకు “మేము సైతం” సేవా సంస్థ టీవీ బహుకరణ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే లక్ష్యంతో శుక్రవారం “మేము సైతం” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 43 ఇంచుల టీవీని బహుకరించారు.ఈ టీవీ ద్వారా ఆన్‌లైన్ విద్య విధానం పై విద్యార్థులకు అవగాహన పెంచడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు మడిపల్లి నర్సింహులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించారు.ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు హాజరై, విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరమని అభినందించారు.

అనంతరం సంస్థ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర రాజు మాట్లాడుతూ, తమ సంస్థ నిరుపేద విద్యార్థులు, అనాథ పిల్లలు,వృద్ధులు, వికలాంగులు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.“మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో సుమారు 20 మంది సభ్యులు కలిసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తుంగ కుమార్, కోశాధికారి చిక్క శ్రావణ్ కుమార్, సభ్యులు దూసరి మురళీధర్, బీమాగోని రమేష్, ఎర్రగొల్ల పాండు,కందడి ప్రకాష్ రెడ్డి, సందే  ఉపేందర్, క్రాంతి నాయక్,గల్మ రాజేందర్ రెడ్డి , గ్రామ నాయకులు చౌడబోయిన మహేశ్, అయిలయ్య, సురేష్, చంద్రయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -