నవతెలంగాణ – నెల్లికుదురు
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు నెల్లికుదురు ఎస్సై చిర రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి, మునిగల వీడు గ్రామాల శివారులో ఉన్న ఆకేరు వాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లామని తెలిపారు. ఈ క్రమంలో నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేశామని వెల్లడించారు.
స్పాట్ లోనే ట్రాక్టర్ డ్రైవర్లు వంగూరి వెంకటేష్, ధర్మారపు ఉమేష్, నిదానపల్లె ప్రవీణ్, పెరుమాండ్ల ప్రదీప్, ఇస్సాంపెల్లి వెంకటేష్ భిక్షం లపై కేసు నమోదు చేశామని అన్నారు. ఇసుక కోసం వెళ్తున్న ఎటువంటి కూపన్లు లేని ఖాళీ ట్రాక్టర్లను సీజ్ చేశామని, ట్రాక్టర్లను ఆర్టిఓ కు రాశామని తెలిపారు. బ్రాహ్మణ కొత్తపల్లి ఆకేరు వాగులో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా ట్రేంచ్ చేశామని ఆయన అన్నారు.



