Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సాధించాలి

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సాధించాలి

- Advertisement -

 జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

మున్సిపాలిటీ పరిధిలోపెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. శుక్రవారం అయన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు మున్సిపాలిటీ లలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్ధాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జననం మరణ నమోదు, వేసవిలో నీటి సరఫరా కార్యాచరణ, మురుగు కాలువల శుభ్రత, వీధి కుక్కల నిర్వహణ, పార్కులలో పచ్చదనం నిర్వహణ, వీధిదీపాల నిర్వహణ మార్కెట్ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎల్ . ఆర్.ఎస్,వంటి వాటి పై మున్సిపల్ కమిషనర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ, పారవేతలో సమర్థవంతమైన విధానాలు పాటించాలని తెలిపారు. ఇంటి పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని,  వంద శాతం పన్ను వసూలు చేయాలని,లక్ష్యాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్లకు సూచించారు. 

మున్సిపల్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్  సూచించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -