Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభం

తాడిచెర్లలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ఏఎస్ఈఏపీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను శుక్రవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ, ఏపిఎం హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధిని పెంపొందించడానికి మంథని నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో మంత్రి శ్రీదర్ బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, తిర్రి అశోక్, ఇందారపు సారయ్య, స్వశక్తి సిసిలు, వివోలు, గ్రూపు మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -