Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తి శ్రద్ధలతో రంజాన్ "ఈద్ ఉల్ ఫితర్ " వేడుకలు

భక్తి శ్రద్ధలతో రంజాన్ “ఈద్ ఉల్ ఫితర్ ” వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ -ఆత్మకూరు 
ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్, హౌజుబుజుర్గు, ఆత్మకూరు, గుడెప్పహడ్, అక్కంపేట, పెంచికలపేట, మలకపెట గ్రామాల్లో ముస్లిం సోదరులు శనివారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను నూతన సంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో వైభవంగా పండుగను జరుపుకున్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు ఆకలి, దుర్భరతలు భరించి ఉపవాసాలు పాటించారు. రోజూ ఐదు సార్లు నమాజ్‌లు, తరావీహ్ ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, దానధర్మాలు చేసి ఆత్మశుద్ధి, దైవభక్తి సాధించారు. శుక్రవారం ఉపవాసాలు ముగిసి, శనివారం నూతన వస్త్రాలు ధరించి ఈద్గా లో  సామూహిక ఈద్ ప్రార్థనలు ఆచరించారు.

రంజాన్ పండుగ ప్రత్యేకతలు
ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన  రంజాన్ మాసం లో,ఉపవాసాల ద్వారా ఆత్మనియంత్రణ, ఓర్పు నేర్చుకోవడం; పేదలకు దానం (జకాత్, ఫిత్ర్) చేయడం; లైలతుల్-కద్ర్ (విశేష రాత్రి)లో ప్రార్థనలు – ఇవి మానవత్వం, సామరస్యాన్ని పెంచుతయి.  ముస్లింలు ప్రార్థన ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం ఇండ్లకు చేరుకొని, సేమియా పాయసాలు ఆరగించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -