Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రంజాన్ సందర్భంగా జామా మసీదులో ప్రత్యేక నమాజ్

రంజాన్ సందర్భంగా జామా మసీదులో ప్రత్యేక నమాజ్

- Advertisement -

–  అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: షబ్బీర్ అలీ
నవతెలంగాణ – కామారెడ్డి

రంజాన్ నెల సందర్భంగా పవిత్ర ఉపవాసాల ముగింపు దశలో కామారెడ్డి పట్టణంలోని జామా మసీదులో  ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం జామా మసీదు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పార్కింగ్ సౌకర్యం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులకు తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను పోరాడి సాధించిన 4 శాతం మైనారిటీ రిజర్వేషన్ మైనార్టీ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో కీలక మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. మైనార్టీల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని అన్నారు. మైనార్టీ సమాజం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మసీదు కమిటీ సభ్యులు, మైనార్టీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -