నిందుతుల వద్ద రెండు బంగారు పుస్తెలు, ద్విచక్ర వాహనం, డు మొబైల్ ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మహిళ మెడలో నుండి పుస్తెలతాడు లాక్కెళ్ళిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినందుకు తరలించినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. సిఐ కథనం ప్రకారం.. ఈ నెల 17న రాత్రి పట్టణంలోని సాయి నగర్ లో మేరుగు లత అనే మహిళ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాసినగర్ కు చెందిన సయ్యద్ మౌలానా, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరే గ్రామానికి చెందిన మంగురు ప్రకాష్ యాదవ్ అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి లత మెడలోని బంగారు గొలుసును బలవంతంగా తెంపుకొని పరారయ్యారు.
వెంటనే బాదితలు మాకు సమాచారం అందించారని తెలిపారు. మేమే మా సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకున్నామని సీఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. రఘుడు సమీపంలో వారిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీయారక్షణార్ధం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామాలలో, పట్టణాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా,పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.



