Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు ద్విచక్రవాహనాలు ఢీ..

రెండు ద్విచక్రవాహనాలు ఢీ..

- Advertisement -

ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – మర్రిగూడ 
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇరువురికి గాయాలు అయిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై మునగాల కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నూకల చిన్న యాదయ్య తన బైక్ పై పొలం వద్దకు బయలుదేరాడు. యరగండ్లపల్లి రోడ్డు మర్రిగూడ గ్రామ శివారులోని కాల్వ వద్దకు చేరుకోగానే అదే సమయంలో మరో వ్యక్తి పల్సర్ బైక్ పై అతివేగంగా, అజాగ్రత్తగా యాదయ్య బైక్ కు ఆపోజిట్ గా వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నూకల యాదయ్య తల్లి నూకల మారెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గాయపడిన మరో వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -