Saturday, March 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిలోక కల్యాణం

లోక కల్యాణం

- Advertisement -

యుద్ధం ఎప్పుడూ
ప్రపంచ మానవాళికి
‘పరాభవ’మే
షడ్రుచులు ఎందుకుంటాయి?
ఏది తిన్నా చేదుగానే..
నెత్తురు కూడు
ఎలా సహిస్తుంది?
ముసుగుపై ముసుగులు
ధరించడమే
మానవ నాగరికతా..?
స్వచ్ఛ మానవత్వం
నిత్యప్రశ్నార్థకం?
ప్రకృతి విధ్వంసం
మానవ చర్య ప్రతిరూపమా?
అణుశక్తి ఆయుధాలు
కృత్రిమమేధలు
మానవ హననంలో భాగమా?
పంచేద్రియాల శ్రమజ్ఞానమే
శాస్త్రీయ పంచాంగం
బతుకూ బతికించడమే
లోక కల్యాణం

  • కె.శాంతారావు
    9958745723
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -