Saturday, March 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధమేఘాల నీడలో రంజాన్‌

యుద్ధమేఘాల నీడలో రంజాన్‌

- Advertisement -

శిథిల భవనాల నడుమే ప్రార్థనలు
జెరూసలేం : దాడులు, ప్రతిదాడులు, అంతర్యుద్ధం వంటి కారణాలతో అనేక ముస్లిం మెజార్టీ దేశాల్లో ఈ ఏడాది రంజాన్‌ను సంఘర్షణ, అస్థిరత పరిస్థితుల్లోనే జరుపుకోవాల్సిన దుస్థితి నెలకుంది. భారత్‌, శ్రీలంక వంటి దేశాల్లో రంజాన్‌ పండుగను శనివారం జరుపుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో పాటు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫిక్రాల్లోని దేశాల్లోనే శుక్రవారమే రంజాన్‌ పండుగ నిర్వహించుకున్నారు. అయితే ఇక్కడ అనేక దేశాల్లో ముస్లింలు యుద్ధ మేఘాల నీడలో రంజాన్‌ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. రంజాన్‌ నెలలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఉపవాస దీక్షలను శుక్రవారం నాడు పవిత్ర ప్రార్థనలతో ముస్లిం సోదరులు విరమించారు.

అయితే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ భీకర దాడుల కారణంగా యుద్ధ మేఘాల నీడలోనే రంజాన్‌ వేడుకలను ప్రారంభించారు. ఈ మతపరమైన వేడుక రెండు రోజుల పాటు కొనసాగుతుంది. నెలవంక దర్శనంతో రంజాన్‌ ఉపవాస దీక్షలను ముగించి, పవిత్ర ప్రార్థనలు చేస్తారు. తరువాత రోజు ఈద్‌ పండుగను జరుపుకుంటారు. నెలవంకను ప్రత్యక్షంగా చూడటంపై ఈ పండుగ తేదీ ఆధారపడ్డం వలన ప్రాంతాన్ని బట్టీ సమయం మారుతుంది. ఈ ఫలితంగా మాలి, నైజర్‌, ఆప్ఘనిస్తాన్‌ వంటి పలుదేశాల్లో గురువారమే ఈద్‌ పండుగను జరుపుకున్నారు. శిథల భవనాల నడుమనే ప్రార్థనలు చేశారు. సుడాన్‌లోనూ గత మూడేళ్లగా అంతర్యుద్ధం కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -