నవతెలంగాణ – హైదరాబాద్ : : భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, “నా బ్యాటింగ్లో టైమింగ్ ఎంత ముఖ్యమో ఎప్పుడూ నమ్మాను. ఇప్పుడు ముందుకు వెళ్లాల్సిన సరైన సమయం వచ్చిందని భావిస్తున్నాను” అని చెప్పారు. రహానే భారత జట్టు తరఫున 85 టెస్టులు, 90వన్డేలు, 20 టీ20ల్లో కలిపి 195 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. ముఖ్యంగా 2020–21 ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయానికి నడిపించి, భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. రిటైర్మెంట్ సందర్భంగా సహచర ఆటగాళ్లు, కోచ్లు, అభిమానులకు రహానే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నిర్ణయంతో భారత క్రికెట్లో ఒక విజయవంతమైన అధ్యాయం ముగిసిందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అజింక్య రహానే రిటైర్మెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



