- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ల ఆధారంగా హత్యాయత్నం, లైంగికదాడి కేసులను జోడించారు. ఈ మేరకు న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఈ కేసులు నిరూపితమైతే ఉదయ్ కృష్ణారెడ్డికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు ఐపీఎస్ సర్వీసు నుంచి తప్పించే అవకాశం ఉంది.
- Advertisement -



