Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఈడీ న్యూరోసైన్స్‌ ఆధారిత లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం ప్రారంభం

ఎస్‌ఈడీ న్యూరోసైన్స్‌ ఆధారిత లెర్నింగ్‌ ప్లాట్‌ఫాం ప్రారంభం

- Advertisement -

శ్రీచైతన్యతో వ్యూహాత్మక భాగస్వామ్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అమెరికాకు చెందిన స్టూడెంట్‌ ఎడ్యుకేషన్‌ డయాగస్టిక్స్‌ (ఎస్‌ఈడీ) భారత్‌లో న్యూరోసైన్స్‌ ఆధారిత లెర్నింగ్‌ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జరిగిన సమావేశంలో ఎస్‌ఈడీ, శ్రీచైతన్య విద్యాసంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. అవగాహన ఒప్పందాన్ని ఎస్‌ఈడీ ప్రతినిధులు, శ్రీచైతన్య ప్రతినిధులకు అందజేశారు. ఎస్‌ఈడీ వ్యవస్థాపకుడు శ్రీనేశ్‌ వి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన నేర్చుకునే విధానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత వ్యవస్థ ఎక్కువగా ఫలితాల ఆధారంగానే అంచనా వేస్తుందని చెప్పారు. ఎస్‌ఈడీ ద్వారా ప్రతి విద్యార్థి ఎలా నేర్చుకుంటారో అర్థం చేసుకుని వారి సామర్థ్యాన్ని వెలికి తీయడం తమ లక్ష్యమని అన్నారు.

శ్రీచైతన్య వంటి ప్రముఖ సంస్థతో భాగస్వామ్యం ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పారు. ఎస్‌ఈడీ సీఈవో అష్లీసంబాలుక్‌ మాట్లాడుతూ పర్సనలైజ్డ్‌ లెర్నింగ్‌ విద్యారంగ భవిష్యత్తు అని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా శాస్త్రీయ, విశ్లేషణను విద్యార్థుల మూల్యాంకనంలోకి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికీ తగిన మార్గదర్శకత అందిస్తామని వివరించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సీమ బొప్పన మాట్లాడుతూ ఎస్‌ఈడీతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. న్యాచురల్‌ ఇంటెలిజెన్స్‌, న్యూరోసైన్స్‌ ఆధారంగా విద్యార్థుల లెర్నింగ్‌ ప్యాటర్న్‌ను అర్థం చేసుకోవడం ద్వారా విద్యావ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. విద్యార్థుల వ్యక్తిగత విద్యా సహాయాన్ని అందిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -